తారక్ ” దేవర ” షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జాన్వి… పోస్ట్ వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ మొదటి భాగం అక్టోబర్ 10వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ కానుంది.

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అదేవిధంగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ ఇలా పలువురు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కినేని, కొనరాజు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ మూవీలో తారక్ కి జోడిగా జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జాన్వి ప్రస్తుతం గోవా షెడ్యూల్లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని instagram స్టోరీ ద్వారా వెల్లడించింది. కొన్ని రోజులపాటు జరుగుతున్న ఈ షూటింగ్లో తారక్ మరియు జాన్వి మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం జాన్వి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.