టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్ డేట్ కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

ఒకే ఒక్క సినిమాతో మంచి ఫేమస్ అయిపోయిన సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మల్లిక్ రాం దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ డీజెటిల్లు . ఈ మూవీ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

ఇక తాజాగా ఈ మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2022లో థియేటర్లో రిలీజ్ అయిన డీజెటిల్లు మూవీ భారీ విజయాన్ని సంపాదించుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్రూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్యాలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. మొదటి భాగంలో నేహా శెట్టి ఈ రోల్లో నటించింది. అనంతరం రోల్లో అనుపమ చేరుకుంది.

ఇక మార్చ్ 29 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లో టిల్లు స్క్వేర్. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఇక రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ట్రైలర్ రిలీజ్ డేట్ ను విడుదల చేయడానికి మేకర్ సిద్ధమయ్యారు. రేపు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.