ఆ లొకేషన్లో అటువంటి పనులు చేస్తూ ఫోటోలను షేర్ చేసిన లావణ్య – వరుణ్ తేజ్.. హల్చల్ చేస్తున్న పిక్స్..!

టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ గా కొనసాగుతున్న లావణ్య త్రిపాఠి అండ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిస్టర్ సినిమాతో ప్రేమలో పడ్డ ఈ జంట గత ఏడాది పెద్దల అంగీకారంతో పెళ్లి బంధం లోకి అడుగుపెట్టారు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక వీరి వివాహానికి తమ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

అనంతరం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న ఫ్రీ వెడ్డింగ్ కి టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు రాజకీయ నేతలు పలువురు హాజరయ్యారు. ఇక ఇటీవలే వీరిద్దరూ కూడా పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్.. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తో ప్రేక్షకులు ముందుకే రాగా లావణ్య త్రిపాఠి మిస్టర్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని అలరించింది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ మరియు లావణ్య హిమాచల్ ప్రదేశ్ వెకేషన్కు చేరుకున్నారు. వీరు గత వారమే వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా వీరు సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ తో పంచుకున్న ఫోటోలు చూసినట్లయితే.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. సూర్యకాంతిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.