దేవరలో ఆ సెక్సీ ఫిగర్ తో ఐటమ్ సాంగ్.. కొరటాల శివ టూ రొమాంటిక్ ఫెలోనే. !

దేవర ..దేవర.. దేవర ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో చేస్తున్న సినిమానే ఈ దేవర. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై జనాలు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అన్ని చక్కగా జరిగి ఉంటే ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ అయి ఉండేది. ఫ్యాన్స్ కి మంచి కిక్కి ఇచ్చి ఉండేది. కొన్ని దుష్టశక్తులు ప్లాన్స్ కారణంగా ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధపడ్డారు .

ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసేడట కొరటాల శివ . సుకుమార్ తన సినిమాలో ఏ విధంగా ఐటెం సాంగ్స్ ని హైలెట్ చేస్తారో ఆ విధంగా కొరటాల శివ కూడా ప్లాన్ చేయబోతున్నారట . ఈ సినిమాలో నురాఫతేహి ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీనీ తన అంద చందాలతో ఊపు ఊపేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తో జత కడితే మాత్రం కెరియర్ రేంజ్ లో టర్న్ అవ్వడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.


దేవర సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది . ఈమెకు సంబంధించిన పిక్చర్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ తెలుగులో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీగా ఉంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉందట. ఆమె కోసం సర్చింగ్ చేస్తున్నారట మేకర్స్..!!