వరలక్ష్మి శరత్ కుమార్ కాబోయే భర్త ..ఎన్టీఆర్ కి ఏం అవుతాడో తెలుసా..?

వరలక్ష్మి శరత్ కుమార్ .. కోలీవుడ్ ఇండస్ట్రీలో.. తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్న పేరు . హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఆ తర్వాత విలన్ గా మారి తనదైన స్టైల్ లో మెప్పించింది . తెలుగు ఇండస్ట్రీలో ఆమె చేసిన సినిమాలు ఎంతలా హీట్ అయ్యాయో మనకు తెలిసిందే . ఒకటి కాదు రెండు కాదు ఆమె నటించిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి .

కాగా రీసెంట్గా ఆమె తన నిశ్చితార్థం జరుపుకుంది . మొదటి నుంచి లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు పెళ్లి లేదు దోమ లేదు అంటూ చెప్పుకొచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఫైనల్లీ లవ్ మ్యారేజ్ చేసుకోబోతుంది ..తన బాయ్ ఫ్రెండ్ నిక్లాయ్ తో నిశ్చితార్థం చేసుకుంది . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయ్. నిక్లాయ్ పెద్ద బిజినెస్ మ్యాన్.. ఆయనకు ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది .

ఆన్లైన్ ద్వారా ఆయన తన పెయింటింగ్స్ ను విక్రయిస్తూ ఉంటారు . వరలక్ష్మి శరత్ కుమార్ -నిక్లాయ్ గత 14 ఏళ్లుగా పరిచయం ఉంది. మొదట మంచి ఫ్రెండ్స్..ఆ తరువాత లవర్స్ గా మారారు. అంతేకాదు నిక్లాయ్ ఎన్టీఆర్కి కూడా మంచి ఫ్రెండ్ అంటూ తెలుస్తుంది . ఆయన పెయిటింగ్స్ అంటే ఎన్ టీఆర్ కు బాగా ఇష్టమట. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది.