నాకు, నాగార్జునకి ఆ ఒక విషయంలోనే ఎక్కువ గొడవలు జరుగుతాయి.. అమల సంచలన వ్యాఖ్యలు..!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వారు ఇప్పుడు పెళ్లి బంధానికి కట్టుబడి ఇండస్ట్రీకి దూరమయ్యారు చాలామంది హీరోయిన్స్. ఈ కోవా కి చెందినదే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమల కూడా. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి అంకితం అయిపోయింది. ఇంటి బాధ్యతలలో మరియు వ్యాపార బిజినెస్లలో రాణిస్తూ తన లైఫ్ని గడిపేస్తుంది అమల.

ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలకి కూడా పాల్గొంటుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల కొన్ని ఆసక్తి గల వ్యాఖ్యలు చేసింది. అమలా మాట్లాడుతూ..’ భార్యాభర్తలు అనగా వారి మధ్య గొడవలు రావడం కామన్. నేను ఏదైనా చేయాలనుకుంటే.. మొదలు పెట్టకముందే నేను అది చేయలేనేమో అని అనుమానంలో ఉంటాను.

దీనితో వెంటనే నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు ఏమైనా చేయగలవు .నువ్వు చేయటానికి ప్రయత్నించు అంటూ నాగార్జున చెప్పటం స్టార్ట్ చేశారు. ఈ ఆర్గ్యుమెంట్ లోనే మా ఇద్దరి మధ్య అనేక మనస్పర్ధలు మొదలవుతాయి.ఇక గొడవ జరిగిన కూడా అది పూర్తిగా మర్చిపోతాం. పడుకునే లోపే ఆ గొడవని సరిదిద్దుకుంటాము ‘ అంటూ కామెంట్స్ చేసింది అమల..ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.