వార్నీ.. విగ్నేష్ శివన్ ని నయనతార అన్ ఫాలో చేసింది అందుకే నా.. ఫైనల్లీ బయటపడ్డ నిజం..!

రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి సంబంధించిన ఒక వార్త ఎంత వైరల్ అయిందో మనం చూసాం . మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే జనాలు షాక్ అయిపోయారు. నయనతార విగ్నేశ్ శివన్ విడాకులు తీసుకోబోతున్నారా ..? నిజంగానే ఇది నిజమా..? అంటూ షాక్ అయిపోయారు . దానికి కారణం నయనతార తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి విగ్నేష్ శివన్ ని అన్ ఫాలో చేయడమే .

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ చాలామంది ఇదేవిధంగా చేస్తున్నారు. విడాకులు తీసుకునే ముందు ఇంటి పేరుని మార్చేసుకుంటూ భర్తలను భార్యలను అన్ ఫాలో చేసేస్తున్నారు . నయనతార కూడా అదే విధంగా తన డివర్స్ విషయంపై హింట్ ఇస్తుంది అంటూ ప్రచారం జరిగింది . అసలు నయనతార విగ్నేష్ శివన్ ని అన్ ఫాలో చేయనేలేదు . అదంతా టెక్నికల్ ప్రాబ్లం .

అయితే ఈ విషయం తెలుసుకోకుండా కొందరు ఆమె విడాకులు తీసుకుంటుంది అంటూ ప్రచారం చేసేసారు . ఫైనల్లీ నిజం తెలుసుకున్న నయన్ అభిమానులు కూల్ అయ్యారు. ప్రజెంట్ నయనతార తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకెళ్తుంది . విగ్నేష్ శివన్ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఒక్క అన్ ఫాలో తో నయన్ – విగ్నేశ్ పేర్లు మారు మ్రోగిపోతున్నాయ్..!!