చిరంజీవి-పవన్ కళ్యాణ్ సక్సెస్ అయిన్నట్లు.. నాగబాబు ఆఫర్స్ దక్కించుకోకపోవడానికి కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ స్థానం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బడా ఫ్యామిలీ. ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అందరూ కూడా టాప్ పొజిషన్ అందుకున్నారు .. అంటే కారణం మెగాస్టార్ చిరంజీవి.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ,,ఇండస్ట్రీ లోకి రావడమే గొప్ప విషయమైనా ఆ రోజుల్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ గా మారి .. ఆ తర్వాత మెగాస్టార్ గా జనాలు చేత ట్యాగ్ చేయించుకొని సంచలనానికి తెరలేపారు.

ఆ తర్వాత తన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ – నాగబాబు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినంత రేంజ్ లో నాగబాబు సక్సెస్ కాలేకపోయారు . దీనికి సంబంధించిన వార్తను ట్రెండ్ చేస్తున్నారు జనాలు . ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ నాగబాబు దక్కించుకోలేకపోయాడు .

అయితే దానికి ప్రధాన కారణం ఆయన లుక్స్ అంటున్నారు జనాలు . మెగాస్టార్ చిరంజీవి – పవన్ కళ్యాణ్ లుక్స్ పరంగా కట్ అవుట్ కు బాగా మ్యాచ్ అవుతారని.. కానీ విలన్ గానే నాగబాబు ఫిజిక్ సూట్ అవుతుంది అని .. బహుశా ఆ కారణం చేతనే ఆయనకు ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు రాలేకపోయి ఉండొచ్చు అంటూ అభిప్రాయపడుతున్నారు .ప్రజెంట్ నాగబాబు టీవీ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు . పొలిటికల్ పరంగానే ముందుకు తీసుకెళ్తున్నాడు . చూద్దాం ఫ్యూచర్లో నాగబాబు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో..???