చరణ్-తారక్-బన్నీ..జాన్వీ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? స్టన్నింగ్ ఆన్సర్..!!

జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉంటుంది . కొంతమందికి ఎక్కువ మంది ఫేవరెట్ హీరోయిన్లు ఉంటారు . అది వేరే విషయం . ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న జాన్వి కపూర్ ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న జాన్వి కపూర్ ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది .

ఆమె ఫేవరెట్ హీరో ఎవరో తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆమెను అడిగిన హీరోల లిస్టులో కాకుండా వేరే హీరో పేరు చెప్పడం హైలైట్ గా మారింది . ఓ ఇంటర్వ్యూలో భాగంగా జాన్వీ కపూర్ ని..” మీ ఫేవరెట్ హీరో ఎవరు..?” అనే ప్రశ్న ప్రశ్నిస్తుంది హోస్ట్ . “చరణ్ – తారక్ – బన్నీ -మహేష్ బాబు “..ఇలా స్టార్స్ అందరి పేర్లు అడుగుతుంది . అయితే జాన్వి కపూర్ మాత్రం తన ఫేవరెట్ హీరో విజయ దేవరకొండ అంటూ చెప్పుకొస్తుంది .

ఆయనతో నటించడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ కూడా చెప్పుకొస్తుంది. దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కాగా జాన్వి కపూర్ ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉంది. అంతేకాదు త్వరలోనే వైజాగ్ లో సెట్స్ పై కి వెళ్లబోతున్న రామ్ చరణ్ – బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను నటించబోతుంది . అంతేకాదు పుష్ప2 సినిమాలో కూడా ఓ కీలకపాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ మూడు సినిమాలు కూడా హిట్ అయ్యేవే.. ఈ మూడు సినిమాలు హిట్ అయితే అమ్మడి కెరియర్ ఏ రేంజ్ లో ముందుకెళ్ళిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..!!