ఆర్ సి16 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. ఇక థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ లైనప్ ఏర్పాటు చేసుకున్న చరణ్.. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది ద‌శ‌కు చేరడంతో ఆర్‌సి 16 సినిమా పనులు గ్రాండ్ లెవెల్ లో ఆరంభించారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. అయితే బుధవారం రాంచరణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా.. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ లెవెల్ లో ఈవెంట్ ఏర్పాటు చేశారు.

ఈ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్లు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా చరణ్‌తో సినిమా చేయబోతున్న డైరెక్టర్లు, నిర్మాతలు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇందులో భాగంగా ఆర్‌సి16 డైరెక్టర్ బుచ్చిబాబు సనా మాట్లాడుతూ హ్యాపీ బర్త్డే చరణ్ గారు.. ఇలాంటి వేడుకలు మీరు మరిన్ని జరుపుకోవాలని.. మీతో జర్నీ చాలా బాగుంది అంటు వివరించాడు. అయితే యాంకర్ శ్యామల మధ్యలో ఇన్వాల్వై ఇక్కడ చిరు గారు లీక్స్ చేయడానికి లేరు.. సో మీరు ఏమైనా ఆర్‌సీ 16 గురించి లీక్ చేయగలరా.. అని ప్రశ్నించారు.

దానికి బుచ్చిబాబు స్పందిస్తూ ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు పూర్తయ్యాయి. ఉప్పెనకి దేవిశ్రీప్రసాద్ ఎలాంటి మ్యూజిక్ అందించారో చూసాం. ఇక ఈ ఆర్‌సి 16కి రెహమాన్ గారు అంతకుమించి బ్లాస్టింగ్ మూమెంట్ వచ్చే మ్యూజిక్‌ అందించాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బుచ్చిబాబు కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆ సాంగ్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.