ఊపిరాడకుండా పట్టుకుని బలవంతంగా కిస్ చేసాడు.. హీరోపై కోర్టులో కేసు వేసా.. షాకింగ్ విషయాన్ని చెప్పిన స్టార్ హీరోయిన్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్‌ సంపాదించుకుంది రేఖ. 1969 లో అంజన అనే బెంగాలీ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఈ సినిమాలో తన కన్నా 20 ఏళ్లు పెద్దయిన విశ్వజిత్ చటర్జీ సరసన జంటగా నటించింది. అయితే ఆ టైంలో సినిమాల్లో ముద్దు సన్నివేశాలు చాలా రేర్ గా కనిపిస్తూ ఉండేవి. ఏదో ఒక సినిమాలో మాత్రమే అలా కిస్ సీన్స్ రూపొందించేవారు. అయితే అంజన సినిమా షూటింగ్ టైంలో హీరో విశ్వజిత్.. రేఖను ఊపిరాడని ఇవ్వకుండా బలవంతంగా పట్టుకుని కిస్ చేశాడట.

అయితే రేఖ ఏం చేయాలో తెలియ‌క గట్టిగా అరిచి ఏడ్చేసిందట. ఈ అవ‌మానాని త‌ట్టుకోలేఖ‌.. వివాదాన్ని కోర్టు వరకు తీసుకువెళ్ళంద‌ట ఈ బ్యూటీ. దీంతో సెన్సార్ వాళ్ళు ఆ ముద్దు సీన్లు తీసేయమని ఆర్డర్స్ వేశారని తెలుస్తుంది. అయితే ఈ సంఘటనలో రేఖకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే.. హీరో ఆమెను బలవంతంగా కిస్ చేస్తుంటే.. సెట్లో ఉన్న వాళ్లంతా ఆపడం పోయి.. చప్పట్లు కొడుతూ, విజిల్స్ వేసి ఎంకరేజ్ చేశారట.

ఆ టైంలో ఆమె చాలా ఇబ్బందిగా, బాధగా ఫీల్ అయిందని తెలుస్తుంది. అయితే అప్పట్లో ఈ న్యూస్‌ తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం రేఖ సోలో లైఫ్ లీడ్ చేస్తుంది. భర్త చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ నుదుటిన కుంకుమ పెట్టుకుని.. ఒంటినిండా చీరతో సాంప్రదాయ బద్దంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. 60 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల అమ్మాయిల యంగ్ లుక్ లో మెరిసిపోతుంది.