చరణ్ తో ఉన్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఓ స్టార్ సెలబ్రటీ..

ఇక పవర్ స్టార్ రాంచరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న చరణ్.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ పై ఫోటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఓ అమ్మాయి కూడా కనిపిస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..

ఆమె ఇప్పుడు చాలా ఫేమస్ సెలబ్రిటీ.. ఆమె మరెవరో కాదండి ప్రముఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్. టాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో హీరోలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికే ఎన్నో సినిమాలతో మంచి పాపులారిటీ ద‌క్కించుకుంది. అలాగే ఢీషో లోను జడ్జ్ గా వ్యవహరించి సెలబ్రిటీగా మారింది. బిగ్ బాస్ 5 లో పాల్గొన్న అనీ మాస్టర్.. తన గేమ్‌తో ప్రేక్షకులను మెప్పించి మరింత హైప్ తెచ్చుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలో వారి ఫేవరెట్ స్టార్ హీరోలకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడం కామన్ గా జరుగుతూ ఉంటుంది.

సాధారణ అభిమానుల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు తమ అభిమాన హీరోల ఫోటోలను స్పెషల్ సందర్భాల్లో.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకునే విషెస్ తెలియజేస్తూ ఉంటారు ఫ్యాన్స్‌. అలా నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ కొందరు అభిమానులు అనీ మాస్టర్ తో చరణ్ దిగిన ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెటింట వైరల్‌గా మారడంతో.. ఆమె అనీ మాస్టర్ నా అస్సలు గుర్తుపట్టలేకపోయాం అంటూ.. ఇప్పుడు అనీ కి అప్ప‌టి అనీ మాస్ట‌ర్‌కు అస‌లు పోలిక లేదు అంటూ క‌మెంట్స్ చేస్తున్నారు.