టిల్లు స్క్వేర్ ప్రిమియ‌ర్ షో రివ్యూ.. మళ్లీ టిల్లుగాడి మ్యాజిక్ రిపీట్ అయ్యిందా..?!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన రొమాంటిక్, క్రైమ్ కామెడీ సినిమా టిల్లు స్క్వేర్. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక నేడు ఈ సినిమా ప్రీమియర్ షో ముగిసింది. ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. 2022లో వచ్చిన డీజే టిల్లు భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసులు వర్షం కురిపించిన ఈ సినిమా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కింది.

ఈ సినిమాలో సిద్దు జొన్న‌లగడ్డ క్యారెట్రైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కుర్రాళ్లకు సిద్దు పాత్ర బాగా కనెక్ట్ అయింది. నాన్‌స్టాప్ నవ్వులతో.. డీజే టిల్లు సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమాను ప్లాన్ చేశారు మేకర్స్. అయితే విమల్ కృష్ణ స్థానంలో మాలిక్ రామ్ ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో సిద్దు జంటగా అనుపమ పరమేశ్వరన్‌ నటించింది. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేశారు.

ఇక టిల్లు స్క్వేర్‌తో మళ్లీ టిల్లుగాడు మ్యాజిక్ రిపీట్ చేశాడో లేదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ అయితే ఎంటర్టైనింగ్‌గా ఉందని సిద్దు జొన్నలగడ్డ ఎప్పటిలాగే తన ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని టాక్‌. ఆయన ఆటిట్యూడ్, క్యారెక్టర్జేషన్ ప్రేక్షకులను క‌డుపుబ్బ నవ్వించిందని తెలుస్తుంది. టిల్లు గాడు 100% ఎంటర్టైన్ చేశాడట. వన్ లైనర్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని తెలుస్తోంది. కొన్ని కామెడీ ఎపిసోడ్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలు ఉన్నా.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది.

 

సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. కొందరు ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉంది అంటుంటే.. మరికొందరు మాత్రం ఫస్ట్ హాఫ్ బాగా ఎంటర్టైన్ చేసిందని.. సినిమా సూపర్ హిట్ పక్కా అని అంటున్నారు. అయితే అనుపమ పరమేశ్వరన్‌.. బోల్డ్‌ సన్నివేశాల్లో జీవించేసారట. కానీ ఫ్యామిలీతో వెళ్లిన ఇబ్బంది పడేంత బోల్డ్ గా అయితే సన్నివేశాలు లేవని తెలుస్తుంది. ఇక టిల్లు స్క్వేర్ లో అనుపమ పర్‌ఫార్మెన్స్ పెద్దగా ప్రభావం చూపలేదని టాక్. పార్ట్ వన్ లో నేహాసెట్టి రోల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో అనుపమ క్యారెక్టర్ మాత్రం మరి ఆ రేంజ్ లో ప్రభావం చూపలేదట.