చాందిని చౌదరిని గెస్ట్ హౌస్ కు రమ్మన్న స్టార్ సెలబ్రిటీ.. వెతుక్కుంటూ వెళ్లి మరి ఆ వ్యక్తి చంప పగలగొట్టిన హీరోయిన్..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ చాందిని చౌదరి కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్న‌ది ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. తర్వాత సినిమాల్లోకి వచ్చి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అయితే తాజాగా ఈమె గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే సినీ ఇండస్ట్రీ కి చెందిన ఓ వ్యక్తి చాందిని చౌదరి కి ఫోన్ చేసి నువ్వు ఇప్పుడే నా గెస్ట్ హౌస్ కి రావాలి.. లేదంటే నీ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతా అంటూ బెదిరించారట.

అయితే ఆమెకు ఏం చేయాలో తెలియక ఆ టెన్షన్ లో ఫుల్ గా ఏడ్చేసిందట. తర్వాత వారి గురించి తెలుసుకొని మరి వెళ్లి చెంప చెల్లుమనిపించిందట. ఇంతకీ ఈ స్టోరీ ఏంటి.. అసలు చాందిని ని గెస్ట్ హౌస్‌కు రమ్మన్నా ఆ వ్యక్తి ఎవరో ఒకసారి చూద్దాం. చివరగా గామి సినిమాలో నటించి సూపర్ సక్సెస్ అందుకుంది చాందిని చౌదరి. తనకు తగ్గ పాత్రలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ఆచితూచి కథ‌లను ఎంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తను నటించింది చాలా తక్కువ సినిమాలైనా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో ఈ బ్యూటీ కి ఓ కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందట.

నువ్వు రేపు గెస్ట్ హౌస్ కి రాకపోతే.. నీ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ వాళ్ళు మాట్లాడారని.. అయితే ఆ మెసేజ్ చూసిన చాందిని ఏం చేయాలో తెలియక.. బాగా ఏడ్చేసిందని.. ఆమె ఏడుపు చూసిన టాలీవుడ్ నటి.. టామ్ బాయ్ స్నిగ్ధ వెంటనే దానిపై రియాక్ట్ అయిందని తెలుస్తుంది. నీపై ప్రాంక్ చేసింది నేనే.. జస్ట్ ఆట పట్టించడానికి అలా చేశానని ఆమె చెప్పిందట. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని అడిగి మరి.. తను ఉన్న ప్లేస్ కు వెళ్లి చెంప చెల్లుమనిపించిందట‌ చాందిని చౌదరి. అయితే ఇదంతా చాలా రోజుల క్రితమే జరిగిందట. ఇక తాజాగా దావత్ షోల సందడి చేసిన నటి స్నిగ్ధ‌ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.