అప్పట్లో సావిత్రి .. ఆ తర్వాత సౌందర్య .. ఇప్పుడు సాయి పల్లవి – శ్రీలీల ఏం టైమింగ్ రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలను ఎక్కువగా కనిపెడుతూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా ఒక సినిమాలో నటించి హీరోయిన్ సక్సెస్ అందుకుందంటే చాలు.. ఆ హీరోయిన్ ని ఓ రేంజ్ లో పొగడడానికి ఆ హీరోయిన్ వల్లే ఇండస్ట్రీకి ఇంత లక్కు వచ్చిందని ప్రూవ్ చేయడానికి నానా రకాల లాజిక్కులు మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది.

ఇండస్ట్రీలో ఎస్ లెటర్ తో స్టార్ట్ అయితే ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ గా ఎదిగిపోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకొస్తున్నారు. మహానటి గా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి పేరు ఎస్ తో స్టార్ట్ అవుతుంది అని .. ఆమె ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోయిన్గా మారింది అనేది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఆ తర్వాత హీరోయిన్ సౌందర్య కూడా తన అందచందాలతో.. నటనతో ..కుర్రాలను ఆకట్టుకునింది అని.. మరి ముఖ్యంగా ఒకానొక టైం లో ఇండస్ట్రీలో ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి -శ్రీలీల కూడా అదే రేంజ్ లో అదే లక్ తో కొనసాగుతున్నారు అని.. వీళ్లు నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే వీళ్ళకి అవకాశాలు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అని .. దీనంతటికి కారణం వాళ్ళు పెట్టుకున్న పేర్లే అని ఆ అదృష్టం అలా కలిసి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ చాలా చాలా ట్రెండ్ అవుతుంది..!!