నా కన్న తండ్రే నన్ను చంపాలనుకున్నాడు.. ‘ రేసుగుర్రం ‘ విలన్ షాకింగ్ కామెంట్స్..!!

రేసుగుర్రం సినిమాతో విల‌న్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు రవి కిషన్. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ఆయ‌న‌ సౌత్ తో పాటు నార్త్ లోను వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక‌ రవి కిషన్ తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. త‌న సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో.. తన లైఫ్ లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడో ఇంటర్వ్యూలో వివరించాడు. ఆయన మాట్లాడుతూ నేను 17 ఏళ్ల ఏజ్‌లోనే ఇంటి నుంచి పారిపోయి ముంబై కి వచ్చేసానని వివరించాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో రవి కిషన్ తన కన్న తండ్రి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా నాన్నలో ఎమోష‌న్స్ అస‌లు ఉండేవి కాదు.. ఆయన చిన్న‌త‌నంలోనే నన్ను దారుణంగా కొట్టి చిత్రహింసలు చేసేవారు. ఒకానొక టైంలో నన్ను చంపాలి అనుకున్నాడు కూడా. ఆ టైంలో అమ్మకు విషయం అర్థమై నన్ను పారిపోమని సలహా ఇచ్చింది.

కేవలం రూ.500 చేతికి ఇచ్చి నన్ను పారిపోమని అమ్మ చెప్పింది. ఆ డ‌బ్బుతోనే ట్రైన్ ఎక్కి ముంబైకి వచ్చేసా. అయితే మా నాన్న కోపంలో కూడా అర్థం ఉంది. మాది ట్రెడిషనల్ ఫ్యామిలీ కావడంతో.. అయినా నన్ను వ్యవసాయం లేదా ప్రభుత్వ ఉద్యోగం చేయమని సలహా ఇచ్చాడు. తమ కుటుంబంలో నటుడు పుడతాడని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అయితే అలాంటి టైం లో నేను ఇంటిదగ్గర వేస్తున్న ఓ చిన్ని నాటకం రామ్‌లీలాలో సీత గెటప్ లో నటించా. అది చూసి ఆయనకు కోపం వచ్చింది. ఓ ఆడపిల్ల వేషంలో అది కూడా వీధి నాట‌కంలో పాల్గొన్నాని నన్ను ఆయన బాగా కొట్టారు అంటూ రవి కిషన్ వివరించాడు. తన కెరీర్ మొదట్లోనే రవి కిషన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటూ యాక్టర్ గా సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమించాన‌ని చెప్పుకొచ్చాడు.

పుట్టినప్పుడు ఎటువంటి గుర్తింపు ఉన్నా లేకపోయినా వెళ్లిపోయేటప్పుడు మాత్రం మనకంటూ ఓ గుర్తింపు ఉండాలని నేను నా చైల్డ్ హుడ్‌లోనే ఫిక్స్ అయ్యా అంటూ వివరించాడు. ఆ ఆశతోనే యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చా.. చిన్నతనంలో నన్ను బాగా కొట్టినందుకు చివరి రోజుల్లో నాన్న చాలా ఫీల్ అయ్యారు అంటూ వివరించాడు. నువ్వే మాకు గర్వకారణం అని కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పుకొచ్చాడు. రవి కిషన్ ప్రస్తుతం హిందీతో పాటు భోజ్‌పూరి, తెలుగు, మరాఠీ, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక రేసుగుర్రం కిక్ 2, సుప్రీం, రాధా, లై, సాక్ష్యం, గద్దల కొండ గణేష్, 90 ఎం.ఎల్, సైరా లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించాడు. కాగా ప్రస్తుతం రవి కిషన్ తన తండ్రి గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్ అవుతున్నాయి.