ఆ కాంట్రవర్షియల్ హీరోయిన్ విషయంలో తలదూరుస్తున్న కృతి శెట్టి.. పెద్ద పుట్టింగిలా మారిపోయిందే..!?

కృతి శెట్టి .. సినిమా ఇండస్ట్రీలో ఆమెకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కృతి శెట్టి తెలుగులో ఉప్పెన సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది . ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా పర్లేదు అనిపించాయి . అయితే కృతి శెట్టి తాజాగా తెలుగులో ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

కృతి శెట్టి డివర్స్ తీసుకున్న హీరోయిన్ మ్యాటర్లో వేలు పెట్టబోతుందట . ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తక్కువ కాలమే కలిసి ఉన్నారు. చాలా తక్కువ టైంలో బాగా పాపులారిటీ దక్కించుకున్న ఈ జంట కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే డైరెక్టర్ వీళ్ళ విడాకుల విషయం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉండడంతో ఈ కాన్సెప్ట్ సినిమాగా చూస్ చేసుకున్నారట .

అసలు విడాకుల విషయంలో తప్పు ఎవరిది ..? అన్న కోణంలో సినిమాను చూపించబోతున్నారట . ఈ సినిమాలో హీరోయిన్గా కృతిశెట్టి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి ఓ యంగ్ హీరోయిన్ ఇలాంటి కాంట్రవర్షల్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి అంటే గట్స్ ఉండాలి. కృతి శెట్టి అలా చేసి డేర్ గల అమ్మాయిగా ప్రూవ్ చేసుకున్నింది. అయితే మరి కొందరు మాత్రం అప్పుడే పెద్ద పుట్టింగిలా ఇలా తయారయింది అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. చూద్దాం మరి కృతి శెట్టి తన తల రాత ని ఎలా మార్చుకుంటుందో..??