తమన్నా చేయాల్సిన ఆ హిట్ సినిమా.. సమంత ఖాతాలో పడడానికి కారణం ఆ హీరో నేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేయడం .. అలాగే ఒక హీరోయిన్ పాత్రకు మరో హీరోయిన్ సెలెక్ట్ అవ్వడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది . సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం . రీసెంట్గా అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ తమన్నా చేయాల్సిన ఆ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను సమంత ఖాతాలో పడేలా చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో అంటూ బాగా వార్తలు వైరల్ అవుతున్నాయి .

ఆ సినిమా మరేదో కాదు “ఓ బేబీ”. పెళ్లి తర్వాత సమంత నటించిన ఫస్ట్ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో సమంత పర్ఫామెన్స్ కెవ్వు కేక.. టూ గుడ్ ..ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే . అలాంటి ఓ పెర్ఫార్మెన్స్ పండించింది . నిజానికి ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా తమన్నా ని అనుకున్నారట . కానీ తేజ సజ్జా.. సమంత పేరును చూస్ చేయడంతోనే నందిని రెడ్డి సమంతా కు ఆఫర్ ఇచ్చిందట .

సమంత – నందిని రెడ్డి చాలా జాన్ జిగిడి దోస్తులైన ఈ పాత్ర కోసం ఎందుకో ఆమె పేరు ఆమె మదిలో తట్టలేదట . తేజ సజెషన్ మేరకే ఆమె సమంత ని సినిమాలో తీసుకుందట . ఫైనల్లీ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. అలా సమంత ఖాతాలో ఓ హిట్టు పడింది తమన్నా ఖాతా నుంచి ఒక హిట్ ఎగిరిపోయింది. ప్రజెంట్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది . తమన్నా మాత్రం బోల్డ్ కంటెంట్ తో బోల్డ్ సిరీస్ తో దూసుకుపోతుంది.