వావ్.. జాక్ పాట్ కొట్టిన ప్రేమ‌లు హీరోయిన్‌.. ఒక్క హిట్‌తో పాన్ ఇండియా స్టార్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించే ఛాన్స్ దొరికితే బాగుండని చాలామంది హీరోయిన్స్ ఆశపడుతూ ఉంటారు. అలాంటి అవకాశం దొరకడం నిజంగానే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అలాంటి ఛాన్స్ కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. కాగా తాజాగా ఓ యంగ్‌ హీరోయిన్ లక్కీగా తాను నటించిన ఒక్క హిట్ సినిమాతోనే ఎన్టీఆర్ సరస‌న‌ నటించే ఛాన్స్ కొట్టేసింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వెండితెరపై రిలీజ్ అయిన ప్రేమలు సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది మ‌మితా బైజు.

తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో నటించిన.. కేవలం ఇటీవల నటించిన ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. కాగా ఈమె మంచి యాక్టరే కాదు డ్యాన్సర్ కూడా కావడం విశేషం. ఈమెకు భరతనాట్యం కూడా బాగా వచ్చట‌. ఇక తాజాగా ఈమె హిట్ కొట్టిన ప్రేమలు సినిమాతో మమితకు వరసగా భారీ ప్రాజెక్టులలో అవకాశాలు క్యూ కడుతున్నాయట. ఈ నేపద్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరస‌న హీరోయిన్గా నటించే ఛాన్స్ ను మమితా సంపాదించుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఆ సినిమా ఏంటో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్‌లో నటిస్తున్నాడంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు రెండో జోడిగా సౌత్ నటి అవసరం పడిందట. పెద్దగా వయసులేని పాత్ర కావడంతో ఈ పాత్రకు మమిత బైజు అయితే బాగా సెట్ అవుతుందని ఆమెను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పాన్‌ లెవెల్‌లో ప్రేక్షకులను కూడా మమిత బైజు త‌న న‌ట‌న‌తో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. అయితే కేవలం ఒక్క హిట్ తో ఇలాంటి భారీ ప్రాజెక్టులో ఛాన్స్ దొరకడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది.