గుడ్డలు ఊడదీసి..ప్రభాస్ ఫ్యాన్ ని చావకొట్టిన బన్నీ ఫ్యాన్స్..ఎందుకంటే(వీడియో)..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎలా కొట్టుకొని చస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టేటస్ అందుకున్నాక అభిమానులు మరింత స్థాయిలో రెచ్చిపోతున్నారు . మా హీరో గొప్ప అంటే మా హీరో తోపు అంటూ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . అవి సోషల్ మీడియాలో మాటలు వరకు అయితే పర్లేదు హద్దులు మీరి పోయి చేతులు వరకు వస్తేనే ప్రాబ్లం . ఇప్పుడు అలాంటి సిచువేషన్ నెలకొంది.

రీసెంట్గా అల్లు అర్జున్ అభిమానులు ఓ రేంజ్ లో రెచ్చిపోయి ఏకంగా ప్రభాస్ ఫ్యాన్ ని చితక బాదేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గొడవలు మనం చూస్తూనే ఉన్నాం . కానీ ఇప్పుడు ఆ ఆన్లైన్ గొడవలు కాస్త రోడ్డుకి ఎక్కేసాయి . మరి ముఖ్యంగా గతంలో మహేష్ బాబు , పవన్ , ప్రభాస్, రామ్ చరణ్ ఫాన్స్ ఎలా కొట్టుకొని చచ్చారు మనం చూసాం. ఇప్పుడు అలాంటి సిచువేషన్ నెలకొంది .

ప్రభాస్ ఫ్యాన్ ని బెంగళూరులో ఓ పదిమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కలిసి చుట్టుముట్టారు . అంతేకాదు చితకబాదారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెను దుమారమే రేపుతుంది . షర్ట్ ఊడదీసి రక్తం వచ్చేలా దారుణంగా కొట్టారు. ఇంకోసారి మా అల్లు అర్జున్ జోలికి వస్తే ఇలాగే జరుగుతుంది అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు . ఇది అక్కడ ఉన్న జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేసి మరి ట్రెండ్ చేస్తున్నారు.

విచక్షణారహితంగా ఆ ఒక్కడిని కొట్టాడు . చితక బాదేశారు . ఆ పది మందిని మీరు అరెస్టు చేయాలి అంటూ కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . పోలీసులు కూడా వెంటనే స్పందించి ఆ పదిమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై కేసులు నమోదు చేశారు . అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవ రావడానికి కారణం వాళ్ళ మాటలే అని ..మా హీరో నెంబర్ వన్ అంటే మా హీరో నెంబర్ వన్ అంటూ మాటా మాటా పెరిగింది అని .. ఆ కారణంగానే ఇలా కొట్టుకునే వరకు వెళ్లారు అని చెప్తున్నారు. నిజమైన ఫ్యాన్ అంటే సినిమాను చూసి ఎంజాయ్ చేయడం ఇలా కొట్టుకొని చావడం కాదు అంటున్నారు జనాలు..!!