పొలిటికల్ లీడర్ మనవరాలితో లవ్.. సిగ్గుపడకుండా ఓపెన్ అప్ అయిన పూరి కొడుకు ఆకాష్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అటెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ప్రేమలో పడ్డాడ్డా..? అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అదే నిజం అనిపిస్తుంది . ఆకాష్ పూరి పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అంతేకాదు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు .

కానీ సక్సెస్ కాలేకపోయాడు . రీసెంట్గా ఈ హీరో ఓ క్లాత్ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి ఒప్పుకున్నాడు . ఈ క్రమంలోనే ఈవెంట్ లో మాట్లాడుతూ..” తాను పొలిటికల్ లీడర్ మనవరాలి తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాను ..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని… అది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పుకారు మాత్రమే అని.. ప్రజెంట్ తాను సింగిల్ గానే ఉన్నాను అని చెప్పుకొచ్చాడు “.

అంతేకాదు ఆకాష్ పూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు . అయితే తండ్రిలాగే ఏ విషయం అయినా నిర్మొహమాటంగా సిగ్గుపడకుండా బయటపెట్టేయడంలో ఆకాశపూరి నెంబర్ వన్ అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. జనరల్గా వేరే స్టార్ సెలబ్రెటీస్ ఏదైనా తమపై వైరల్ అవుతున్న వార్తపై రియాక్ట్ అవ్వరు . కానీ ఆకాశ్ పూరి మాత్రం చాలా సింపుల్గా క్లియర్ గా నాకు సంబంధం లేదు అంటూ ఒక్క మాటతో కొట్టి పడేసాడు. దట్ ఈజ్ ఆకాష్ పూరి అంటున్నారు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్..!!