అంతమంది తో వర్క్ చేసిన రాజమౌళి.. ఫేవరేట్ అయిన ఆ హీరోయిన్ ని ఎందుకు దూరం పెట్టాడో తెలుసా..?

ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయిన పెద్ద డైరెక్టర్ అయిన కొన్ని విషయాలలో తప్పు చేయాల్సిందే. అప్పుడే వాళ్ళ లైఫ్ లో ఇంకా ఎత్తుకు ఎదగగలరు. మన రాజమౌళి కూడా అంతే కొన్ని కొన్ని విషయాలలో అలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాడు . రీసెంట్గా సోషల్ మీడియాలో రాజమౌళికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి దర్శక ధీరుడుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . జక్కన్నగా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు జనాలు. రాజమౌళి తన సినిమాలో హీరోయిన్స్ విషయం పట్ల ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో మనకు తెలిసిందే .

అయితే రాజమౌళి ఫేవరెట్ హీరోయిన్ నిత్యామీనన్ అంటూ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు . కానీ ఆమెతో ఒక్క సినిమా కూడా చేయలేదు. దానికి కారణం ఏంటా అంటూ హోస్ట్ ప్రశ్నించగా ..”ఆమె హైట్ మిగతా హీరోలకి మ్యాచ్ అవ్వదు అని ..నేను చూస్ చేసుకునే హీరోలు అందరూ భారీ ఆజానబాహులుగా ఉంటారు అని ..మరి అలాంటి కటౌట్ ముందు నిత్యామీనన్ తేలిపోతుంది అని ఆ కారణంగానే ఆమెతో సినిమాను తెరకెక్కించలేకపోతున్నాను అని బయట పెట్టాడు “.

సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. రాజమౌళి ఈ విధంగా కూడా ఆలోచిస్తారా ..?అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. ప్రజెంట్ రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుతో ఓ భారీ అడ్వెంచర్స్ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో ఇండియాకి మరో ఆస్కార్ అవార్డు తీసుకురావడం పక్క అంటున్నారు జనాలు..!!