ఓరి నీ దుంప తెగ.. మా కీర్తి సురేష్ ని అంత మాట అనేశావ్ ఏంట్రా ..? ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ బడా హీరో వరుణ్ ధావన్ .. కీర్తి సురేష్ పై చేసిన కామెంట్స్ ఆమె అభిమానులకు హర్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ అక్కడ పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ పడకపోయినప్పటికీ కీర్తి సురేష్ అభిమానులు మాత్రం తీవ్రంగా హర్ట్ అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ వరుణ్ ధావన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే .

అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె కాల్ షీట్స్ ఇవ్వట్లేదట . ఈ ప్రచారం కొన్నాళ్లుగా బాలీవుడ్ లో జరుగుతుంది. అయితే రీసెంట్గా వరుణ్ దావన్ దాన్ని అఫీషియల్ చేసేసాడు . కీర్తి సురేష్ రీసెంట్గా పోస్ట్ చేసిన ఫొటోస్ కింద “ప్లీజ్ గివ్ మీ డేట్స్ అమ్మ” అంటూ కామెంట్ పెట్టాడు . దీంతో కోలీవుడ్ లో బాలీవుడ్ లో ఈ న్యూస్ వైరల్ గా మారింది . కీర్తి సురేష్ నిజంగానే కాల్ షీట్స్ ఇవ్వకుండా టార్చర్ చేస్తుందా..? అంటూ ప్రచారం ఊపొందుకుంది.

దీని అంతటికి కారణం వరుణ్ ధావన్ చేసిన కామెంట్ అంటూ మండిపడుతున్నారు ఆమె అభిమానులు . కీర్తి సురేష్ ను అలా ఎలా అనగలవు..?? అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రజెంట్ కీర్తి సురేష్ ఫోటో కింద వరుణ్ ధావన్ చేసిన కామెంట్ ట్రెండ్ అవుతుంది. చూద్దాం దీనిపై వరుణ్ ధావన్ లేదా కీర్తి సురేష్ ఏ విధంగా స్పందిస్తారో..? కామెంట్ సంగతి పక్కన పెడితే వీళ్ల సినిమాకి మాత్రం హ్యూజ్ పబ్లిసిటీ వచ్చేసింది..!!