వరుణ్ తేజ్ ‘ ఆపరేషన్ వాలెంటైన్ ‘ వాయిదా.. కారణం ఇదే..

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్.. ఇటీవల సుట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే వరుణ్ వివాహమైన తర్వాత న‌టిస్తున్న మొట్టమొదటి సినిమా ఆపరేషన్ వాలెంటైన్. బాలీవుడ్ నటి మానుషి చిల్లర ఈ సినిమాలో హిరయిన్‌గా నటిస్తుంది. శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో.. రూపొందుతుంది.

ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ టీజర్ కట్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చిపెట్టింది. దీనితో మరో డిఫరెంట్ కంటెంట్‌లో వరుణ్ రాబోతున్నాడని మెగా ఫాన్స్ అంత ఓ క్లారిటీకి వచ్చారు. కాగా ఈ సినిమాను మేకర్స్‌ ఫిబ్రవరిన రిలీజ్ చేస్తామని గతంలో అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. కానీ మళ్ళీ ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా కన్ఫార్మ్ చేశారు. అయితే ఈ సినిమా ఎందుకు వాయిదా వేశారు అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఈ సినిమాకి ఇంకా బ్యాలెన్స్ విఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా ఉందట. ఆ కారణంగానే సినిమాను వాయిదా వేశారని తెలుస్తుంది. దీంతో ఈ సినిమా ఫిబ్రవరి మూడోవారానికి కానీ.. మార్చి మొదటి వారానికి గాని రిలీజ్‌ చేయబోతున్నట్లు టాక్.