మన టాలీవుడ్ సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్‌ సంపాదన తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఎవరి సంపాదన ఎంతంటే..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు, సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకుంటూ తమ పర్సనల్ లైఫ్ కు, సినిమాలకు సంబంధించిన అప్డేట్లు షేర్ చేసుకుంటారని సంగతి అందరికీ తెలుసు. అయితే చాలామంది పర్సనల్ విషయాలే కాకుండా పలు యాడ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ లక్షల్లో సంపాదిస్తారు. ఇలా మన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎంత సంపాదిస్తారో ఓసారి చూద్దాం.

రష్మిక మందన :


పుష్ప సినిమాతో నేషనల్ ఫ్రెష్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు యాడ్ ప్రమోషన్ల తో సందడి చేస్తూనే ఉంటుంది. అయితే ఈమె ఒక్క యాడ్ ప్రమోషన్ కోసం రూ. 30 లక్షల వరకు పుచ్చుకుంటుందట.

సమంత :


ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న సమంత ఇప్పటికీ హాట్ అందాలతో సోషల్ మీడియాలో కొర్రకారును హీటెక్కిస్తూ ఉంటుంది. దాదాపు 50 మిలియన్ ఫ్యాన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక్క యాడ్ ప్రమోషన్ కోసం ఏకంగా రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తుందట.

కాజల్ అగర్వాల్ :


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎన్నో హిట్ సినిమాలు నటించి పాపులాంటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన పర్సనల్ విషయాలతో పాటు సోషల్ మీడియా వేదికగా ఎన్నో యాడ్ ప్రమోషన్లను కూడా చేస్తూ ఉంటుంది. అయితే ఈమె ఒక యాడ్ ప్రమోట్ చేయడానికి రూ. 50 లక్షలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.

పూజా హెగ్డే :


గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ వరుస ఫ్లాప్లు రావడంతో ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం భారీ క్రేజ్ తో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఒక్కో యాడ్ ప్రమోషన్ కోసం రూ. 20 నుంచి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుందట.

మహేష్ బాబు :


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్ల మంది అభిమానాని సొంతం చేసుకున్న మహేష్ ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ప్రజల ప్రశంసలు అందుకుంటూ ఉండే మహేష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక్క యాడ్ ప్రమోట్ చేయాలంటే రూ. 2కోట్ల వరకు చార్జ్ చేస్తాడట.

విజయ్ దేవరకొండ :


హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దోసుకుపోతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు.. యువతలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికపై ఏదైనా యాడ్ ప్రమోట్ చేస్తే కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు తీసుకుంటాడని తెలుస్తుంది.