ఆ స్టార్ డైరెక్టర్ అంటే ప్రభాస్ కు అంత ఇష్టమా.. ఎందుకంత స్పెషల్ అంటే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిరి దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా స‌లార్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న రెబల్ స్టార్.. ప్రస్తుతం కల్కి 2898ఏడి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టిస్తాడని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో భారీ తారాగణం అంతా నటించడంతో ప్రమోషన్స్ వేరే లెవెల్లో సాగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ అందరికి ప్రభాస్ అంటే ఎంతగానో అభిమానం. అయితే ప్రభాస్‌కు వీరందరిలో ఇష్టమైన డైరెక్టర్ ఎవరైఉంటారో తెలుసుకోవాల‌నే ఆశ‌క్తి అందరిలోనూ ఉంటుంది.

అలా ప్రభాస్ ఎంతగా ఇష్ట‌ప‌డే డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ మొదటి వరుసలో ఉంటాడని సమాచారం. పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్ లో గతంలో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలో రిలీజైన‌ సంగతి తెలిసింది. అయితే ఈ సినిమాలు భారీ రేంజ్‌లో సక్సెస్ సాధించకపోయినా.. సినిమాలకు మంచి టాక్ వచ్చింది. అప్పట్లో ప్రభాస్.. పూరి జగన్నాథ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పూరి జగన్నాథ్ అంటే నాకు ఎంతో అభిమానం.. పూరి జగన్నాథ్ యాటిట్యూడ్‌కు నేను ఫిదా అయ్యా.. అంటూ ప్రభాస్ ఆ ఇంట‌ర్వ్యూలో వివరించాడు. హీరోలను పూరి ఎలివేట్ చేసే విధానం బాగుంటుంది అంటూ ప్ర‌భాస్‌ కామెంట్ చేశాడు.

Kalki 2898 AD upcoming 2024 new film of Prabhas and Deepika Padukone (a+) -  Movie| Release date, Trailer, Budget, Cast and crew

ఆయనలో ఏదో మ్యాజిక్ ఉందని.. ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ ప్లాప్‌ లతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా ఇస్స‌ట్లో వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. ఇక ఇప్పటికే ప్రభాస్ వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ.. దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కల్కి 2898 ఏడి తో పాటు.. ది రాజ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ నటించనున్నాడు. అలానే ఇంకొన్ని సినిమాలు ప్రభాస్ లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఇప్పటివరకు ఓకే చేసిన ప్రాజెక్ట్స్ అన్ని లైన్‌ గా పూర్తి చేసి అన్ని సినిమాలతో హిట్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.