కీర్తి సురేష్ కి ఫస్ట్ ల‌వ్ లెటర్ రాసిన ఆ యువకుడు ఎవరో తెలుసా?.. సీక్రెట్ రివిల్..!

మహానటి గా పేరుగాంచిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక డీలా పడిపోయింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన ఫస్ట్ లవ్ లెటర్ గురించి సంబోధించింది.

కీర్తి సురేష్ మాట్లాడుతూ..” నాకైతే స్కూల్ నుంచి కాలేజ్ వరకు కూడా ప్రపోజల్స్ వచ్చిందేలే. అయితే ఒకసారి నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లాను. అక్కడ ఓ అభిమాని సడన్గా నా ముందుకొచ్చి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్ళాక దాన్ని తెరిచి చూసా.

అందులో నా అరుదైన ఫోటోలతో కూడిన ఆల్బమ్ ఉంది. దానితోపాటు నాపై ప్రేమను వ్యక్తి పరుస్తూ రాసిన లేక కూడా ఉంది. అందులో నన్ను పెళ్లి చేసుకుంటానని రాశాడు. అదే తొలిసారి నాకు వచ్చిన ప్రేమలేఖ ” అంటూ వెల్లడించింది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇప్పటివరకు నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదంటే మాకు నమ్మశక్యం కింద లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.