హిమోగ్లోబిన్ పెంచే 5 ఆహారాలు ఇవే..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో మారుతున్న జనరేషన్ బట్టి అనేక రోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎక్కువగా హిమోగ్లోబిన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఆహారం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మరి ఏ ఆహారాలు తింటే హీమోగ్లోబిన్ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా అనేక పోషకాలు మీ శరీరానికి అందుతాయి. ఇక హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు తినాల్సిన రెండవ ఆహారం పప్పు దినుసులు. పప్పు దినుసులలో ఉండే పోషకాలు కారణంగా హిమోగ్లోబిన్ పెరగడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు దరి చేరవు.

ఇక బీట్రూట్ లో ఉండే ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా కూడా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. దానిమ్మ పండ్లు తినడం ద్వారా కూడా హిమోగ్లోబిన్ ని పెంచుకోవచ్చు. అదేవిధంగా నూనె తక్కువగా ఉండే సాల్మన్, ట్యూనా వంటి చాపల్లో ఐరన్ మరియు విటమిన్ బి అధికంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పైన చెప్పిన ఆహారాలను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు తీసుకుంటూ మీ బాడీలో ఉన్న హిమోగ్లోబిన్ ని పెంచుకోండి.