ఎన్టీఆర్ ఫేవరెట్ యాక్టర్ ఎవరో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..

నందమూరి సినీ బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ మొదటిలోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకున్న ఈయన.. అప్పటివరకు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వారికి గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు. అలా వరుస సినిమాల్లో నటిస్తూ హిట్లు అందుకున తార‌క్‌ టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా క్రేజీ సంపాదించుకున్నాడు. చివరిగా తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవరా సినిమాతో మ‌రో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక‌ తారక్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి దాదాపు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పటికీ ఎన్టీఆర్ ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు నేను చేయాల్సిన వైవిధ్యమైన పాత్రలు ఇంకా చాలా మిగిలే ఉన్నాయి అంటూ వివరిస్తాడు.

Unknown facts about Jr. NTR, which will surprise you

అయితే ఎన్టీఆర్ కు నచ్చిన యాక్ట‌ర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు.. జూనియర్ ఎన్టీఆర్ తాతనే అని అందరికీ తెలుసు. అయితే సీనియర్ ఎన్టీఆర్ కాకుండా ఎన్టీఆర్ కు నచ్చిన మరొక నటుడు ఎవరు తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకులు అందరిలోనూ ఉంటుంది. అలా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రస్తుతం ఉన్న యాక్టర్స్ లో ఎన్టీఆర్ కు నచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ అట. ప్రకాష్ రాజ్ నిన్నటి వరకు టాలీవుడ్‌లో బిజీ స్టార్‌గా దూసుకుపోయాడు. తండ్రిగా, విలన్‌గా, అన్నగా, తాతగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించిన ప్రకాష్ రాజ్.. జూనియర్ ఎన్టీఆర్ ని కూడా తన న‌ట‌న‌తో ఆకట్టుకున్నాడట‌. జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టమని.. ప్రకాష్ రాజ్ ను ప్రశంసించాడు. అందుకే ఎన్టీఆర్ తన సినిమాల్లో ప్రకాష్ రాజు ఉండేలా ప్లాన్ చేసుకుంటానని వివ‌రించాడు.

Prakash Raj Dance With NTR in Temper movie

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల‌తో పనిచేసేటప్పుడు మన టాలెంట్ ఇంకా బయటకు వస్తుందని ఉద్దేశంతోనే ఆయనతో నటించడానికి ఇష్టపడతాడ‌ట తార‌క్‌. ఈ కారణంతోనే ఎన్టీఆర్‌ నటించే సినిమాల్లో ప్రకాష్ రాజ్‌ని కూడా కొన్ని సందర్భాల్లో రిఫర్ చేస్తారట. ఇలా ఇప్పటికే వీరిద్దరి కాంబోలో అశోక్, ఊసరవెల్లి, కంత్రి, బృందావనం, టెంపర్ లాంటి ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాటిలో ప్రకాష్ రాజ్‌ నటించడానికి కూడా ఎన్టీఆర్ కారణమని తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ భావించిన‌ట్లే.. ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ కలిసి ఓ సన్నివేశంల్లో నటించారంటే ఆ సన్నివేశం కచ్చితంగా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. ఇద్దరు యాక్టింగ్‌లో మంచి పట్టు ఉన్నవారు కావడంతో.. వీళ్ళిద్దరు నటించిన సీన్లలో ఇద్దరు పోటాపోటీగా ఎలివేట్ అవుతూ ఉంటారు.