అమ్మ బాబోయ్ అనుపమ పరమేశ్వరన్ కు ధైర్యం ఎక్కువే.. అడవుల్లో ఒక్కటే ఏం చేస్తుందో చూడండి..

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రేమమ్‌ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు.. తెలుగు తో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇక టాలీవుడ్‌లో అనుపమ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ తో టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో సిద్దు జనుల గడ్డ హీరోగా తెరకెక్కి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న టిల్లు మూవీకి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్లో బోల్డ్ సీన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అనుపమ.. టూ మచ్ బోల్డ్‌ గా నటించింది. హ‌ద్దులు చెరిపేసి రెచ్చిపోయింది. అది చూసిన ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదేంటి అనుపమ.. నిన్న మొన్నటి వరకు అంత ట్రెడిషనల్ గా ఉన్న నువ్వు సడన్గా ఇంత బోల్డ్‌ గా మారిపోయావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ కేరళ కుట్టి తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసుకుంది. ఈ వీడియోలో స్కై డ్రైవింగ్‌, స్కై రోప్‌ సైకిలింగ్‌, కార్ రేస్, వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయడం, అడవిలో జంతువులను చూస్తూ ప్రకృతిని ఆస్వాదించడం.. ఇలాంటివి కనిపిస్తాయి. అలాగే బోట్లో డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపించింది. కాగా అడవిలో టైగర్ ని కూడా అనుపమ దగ్గర నుంచి చూస్తూ విడియోకి స్టిల్ ఇచ్చింది. అమాయకంగా కనిపించే అనుపమలో ఇంత ధైర్యం ఉందా.. అంత దగ్గర నుంచి పులిని చూస్తూ కూడా కాస్త కూడా భయం లేకుండా వీడియోకు స్మైల్ ఇస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.