బియ్యం నీటితో సిల్కీ హెయిర్ మీ సొంతం..!

సాధారణంగా ప్రతి ఒక్కరు బియ్యం కడిగిన నీటిని పడమోస్తూ ఉంటారు. కానీ వీటిలో ఉండే పోషకాలు గురించి తెలుసుకుంటే ఈ పని అస్సలు చేయరు. బియ్యంలో ఉండే పోషకాలు ఆధారంగా మీ హెయిర్ ని సిల్కీ హెయిర్ గా మార్చుకోవడంతోపాటు పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. వారి కోసమే ఈ వార్త. బియ్యం నీటిని వారానికి మూడు రోజులపాటు మీ హెయిర్ కి అప్లై చేయడం ద్వారా అందులో ఉండే పోషకాలు మీ హెయిర్కి అంది మీ హెయిర్ పొడవుగా పెరగడంతో పాటు సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది.

జుట్టు చివర్లు చిట్లిపోకుండా బియ్యం నీటితో కాపాడుకోవచ్చు. బియ్యం నీరు జుట్టు లో ఉండే చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టు చర్మంలో దురద మరియు చిరాకు వంటి సమస్యలను తగ్గిస్తుంది. బియ్యపు నీటిలో ఉండే పోషకాలు కారణంగా జుట్టు ఊడడం తగ్గడంతో పాటు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇక మనం వేస్ట్ గా పడమోసే బియ్యం నీటిని కనుక వారానికి మూడు రోజుల పాటు హెయిర్ కి అప్లై చేయడం ద్వారా పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.