వాట్ : అనుష్క అసలు క్యారెక్టర్ ఇదేనా.. ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేసిన మేకప్ మ్యాన్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మను స్వీటీ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అయితే ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అంతే స్వీట్‌గా ఉంటుంద‌ని చాలామందికి తెలియదు. తాజాగా ఆమె వద్ద పనిచేసిన మేకప్ మ్యాన్ చంద్ర అనుష్క ఒరిజినల్ క్యారెక్టర్‌ను రివీల్ చేశాడు. అతను అనుష్క మొదటి మూడు సినిమాలకు మేకప్ మ్యాన్ గా వ్య‌వహ‌రించాడు. తర్వాత అనుష్కతో పంచాక్షరి సినిమాను ప్రొడ్యూసర్గా తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. దీంతో భారీ లాభాలు అర్జించాడు చంద్ర. యోగ టీచర్గా కెరీర్ స్టార్ట్ చేసిన స్వీటీ.. నాగార్జున నటించిన సూపర్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకొని నటనలో తన సత్తా చాటుకుంది.

తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ టాలీవుడ్లో అందరూ హీరోయిన్ల కంటే భిన్నంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది ఈ సినిమాల్లో స్టార్ హీరోలను మించి పాపులారిటీ దక్కించుకుంది. బాహుబలి లోను ప్రభాస్ కి దీటుగా తన నటనతో మెప్పించిన ఈమె.. ఈ మూవీ తర్వాత ఒకటి, రెండు సినిమాల్లో నటించిన అవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. త‌ర్వాత‌ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇక ఇటీవల మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమాలో నటించింది అనుష్క. ఇక తాజాగా అనుష్క గురించి రామచంద్రరావు ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుష్క చాలా సెన్సిటివ్ అని.. తన ముందు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతుందని..

From makeup man to producer - Rediff.com

తనకు ఆ సమస్య వచ్చినట్లు ఫీల్ అవుతుందని.. ఆమెకు దయ కూడా ఎక్కువ. మరే హీరోయిన్ లో అలాంటి క్వాలిటీస్ నేను చూడలేదంటూ ప్రశంసలు వర్షం కురిపించాడు. మొహ‌మాటం కోసం కాకుండా హార్ట్ తో ఏ పనైనా చేస్తుంది. హార్ట్ ఫుల్ గా ఫీల్ అవుతుంది అంటూ వివరించాడు. ఏ విషయంలోనైనా చివరికి మనీ విషయంలో కూడా ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టడం ఆమెకు తెలియదంటూ వివరించాడు. ఇండస్ట్రీలోనే అనుష్క చాలా స్పెషల్ పర్సన్. ఇలాంటి అమ్మాయి దొరకడం మన అదృష్టం అంటూ వివరించాడు. ఇలాంటి మంచి అమ్మాయి హీరొయిన్ గా దొరకడం మరో 10 ఏళ్లకు కూడా మనకు సాధ్యం కాదని చెప్పుకొచ్చాడు. అయితే ఎంత మంచితనం ఉన్న వాళ్ళని మిస్ యూస్ చేసుకునే వాళ్ళు చాలా వద్దే ఉంటారు కదా అని ప్రశ్నించగా.. ఆమెను ఎవరు మోసం చేయలేరు.

Anushka Shetty

ఒక మనిషి ఎలాంటి వారు అతని క్యారెక్టర్ ఇట్టే గ్రహించగలదు అనుష్క. అంత‌ పిచ్చిదేమి కాదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుంది. అందుకే ఎవరు ఆమెను వేలెత్తి చూపించే సాహసం కూడా చేయలేరట్టు వివరించాడు. ఇప్పటికే నాకు టచ్ లోనే ఉందని మెసేజ్ చేస్తే రియాక్ట్ అవుతారు, ఫోన్ మాట్లాడతారు అంటూ వివరించిన ఆయన.. ఇటీవల మాత్రం ఆమె నా ఫోన్ లకు రియాక్ట్ కావడం లేదు, మెసేజ్ కూడా రెస్పాండ్ అవ్వటం లేదు దానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. మా ఇద్దరి మధ్యలో అయితే ఎటువంటి గొడవ జరగలేదు అంటూ వివరించాడు. ఇక అనుష్క ప్రస్తుతం కృష్ డైరెక్షన్ లో ఓ సినిమా నటిస్తోంది. ఈ సినిమాకు శీలవతి అని టైటిల్ చూస్తున్నార‌ట‌. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. లేడీ ఓరియంటెడ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుంద‌ట‌.