తారక్ ” దేవర ” మూవీ ప్రమోషన్స్ కోసం స్పెషల్ ప్లానింగ్ చేసిన మేకర్స్..!

నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో తారక్ ఒకరు. త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రస్తుతం హీరోగా దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది.

ఇక ఈ మూవీ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ సంస్థలు కలిపి గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ సరసున‌ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కి గాయం అవ్వడంతో మూవీ రిలీజ్ డేట్ మార్పిడి చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇక అసలు మేటర్ ఏమిటంటే.. దేవర ప్రమోషన్స్ కోసం టీం గట్టి ప్లానింగ్ చేస్తుందట. ఈ మూవీ హీరో ఎన్టీఆర్ ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్రమోట్ చేయడం కోసం అనేక ప్రాంతాల్లో పర్యాటనించనున్నారని తెలుస్తుంది. వీలైనంతవరకు తమ సినిమాని ఆడియన్స్ లో కి వెళ్లే లాగా ప్రయత్నిస్తారట. ఇక ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.