నాచురల్ స్టార్ నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..!

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చా అంటే సందేహం లేకుండా ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మొదట రవితేజ అడుగుపెట్టినప్పటికీ అనంతరం నాచురల్ స్టార్ అడుగు పెట్టారు. ఇక నాని ప్రతి ఇంట్లో ఒక కొడుకు స్థానాన్ని రీప్లేస్ చేస్తున్నాడు.

ఇక ఇటీవల హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీని డివిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తొందరగా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల‌ ముందుకి రానుంది. ఇక దీని అనంతరం నాని కాంబోలో రెండు ప్రాజెక్ట్స్ రానున్నట్లు.. పలు మీడియా మధ్య మాలలో కథలు ప్రచారం అయిన సంగతి తెలిసిందే.

అందులో ఒకటి బలగం డైరెక్టర్ రేణుతో ఓ సినిమా. నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బలగం డైరెక్టర్ వేణుతో చేయనున్నట్లు అనేక ప్రచారాలు జరిగాయి. ఇక అసలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. ఈ మూవీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో నాని క్యారెక్టర్ అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక వీరీ కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక ఈ మూవీని ప్రముఖ సంస్థ నిర్మిస్తుండగా అతి త్వరలో ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు.