అనుష్క నెక్స్ట్ మూవీ పై ఫుల్ క్లారిటీ.. హీరో ఎవరంటే..!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్స్ లో అనుష్క శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక దీంతో అనుష్క నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక అనుష్క ఎక్కడికి వెళ్ళినా తన నెక్స్ట్ సినిమా గురించే అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఇక అనుష్క నెక్స్ట్ మూవీ పై సోషల్ మీడియాలో అనేక ప్రసారాలు జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో అనుష్క సినిమా చేస్తుంది అంటూ ప్రచారాలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పైనే ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. దీని ప్రకారం ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇప్పుడు లాక్ అయ్యిందట. అనుష్క నెక్స్ట్ క్రిష్ దర్శకత్వంలో ఓ స్టార్ హీరోతో నటించనుందట అనుష్క. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ హీరో ప్రభాస్ ఏ అయితే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు స్వీటీ అభిమానులు. ఇక ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.