నాకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం.. పెళ్లయి మూడు నెలల కాకముందే మరో హీరోయిన్ పై మోజుపడ్డ వరుణ్ తేజ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. ఇక వరుణ్ ఇటీవల లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ 2023లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ” ఆపరేషన్ వాలెంటైన్ “. ఈ సినిమా ఈనెల 16న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మీకు ఏ హీరోయిన్ అంటే ఎక్కువగా ఇష్టం బ్రో అని ఓ ఫ్యాన్ అడగగా..” నాకు అందరు హీరోయిన్లు ఒక్కటే. కానీ అందరికన్నా కొంచెం ఇష్టమైనది సాయి పల్లవి. ఆమె యాక్టింగ్ బాగుంటుంది ” అంటూ సమాధానమిచ్చాడు. ఇక ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” పెళ్లై మూడు నెలలు కాకముందే మరో హీరోయిన్ పై మనసు పడ్డావ్ ఏంటి బ్రో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.