రవితేజ ” ఈగల్ ” మూవీ రన్ టైం లాక్.. ఇక ఒక్కొక్కడికి మోత మోగాల్సిందేగా..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ ” ఈగల్ “. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీ నిజానికి సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాలి. కానీ అనుకోని పరిస్థితులు మూలంగా ఈనెల 9న రిలీజ్ కి సిద్ధమయ్యింది.

ఇక ఈ సినిమాలో నవదీప్, మధుబాల, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా సెన్సార్ వారి నుంచి యు/ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ యొక్క రన్ టైం లాక్ అయ్యింది. ఈ మూవీ 158 నిమిషాలు విడిదితో సాగనుంది.

ఇక అందరి లో మంచి అంచనాలు నెలకొల్పిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ రకమైన టాక్ అందుకుంటుందో చూడాలి మరి. ఇక రవితేజ టైగర్ నాగేశ్వరరావు వంటి బ్లాక్ బస్టర్ అనంతరం నటించిన సినిమా కనుక ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని మాస్ మహారాజ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇదే కనుక నిజమైతే రవితేజ కి మరిన్ని అవకాశాలు దక్కుతాయని చెప్పొచ్చు.