“దేవర” కొత్త పోస్టర్ లో ఈ ట్విస్ట్ గమనించారా..? స్టోరీ మొత్తం బయటపడిపోయిందిగా..!!

దేవర.. దేవర.. దేవర.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమానే ఈ దేవర . ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీకాంత్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇంకా పలువురు నటులు ఈ సినిమాలో మంచి మంచి పాత్రలో కనిపించబోతున్నారు .

నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది . కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 10 న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు . అదే విషయాన్ని ఎన్టీఆర్ అఫీషియల్ గా ప్రకటించారు . పనిలో పని కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే కొత్త పోస్టర్ తో సినిమా సగం మ్యాటర్ లీక్ అయిపోయింది అంటూ అభిమానులు ఆ పోస్టర్ ని ట్రెండ్ చేస్తున్నారు .

ఇప్పటివరకు మనకు దేవర పోస్టర్స్ లో ఎన్టీఆర్ ఓల్డ్ లుక్స్ లోనే కనిపిస్తాడు . కానీ కొత్త పోస్టర్లో మాత్రం యంగ్ లుక్స్ లో కనిపించాడు. అంతేకాదు వర అనే దాన్ని రెడ్ కలర్ లో చూపిస్తారు. అంటే ఇన్నాళ్లు మనం దేవర పోస్టర్స్ లో చూసిన దేవర తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు అని.. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్లో ఉన్న ఎన్టీఆర్ కొడుకుగా “వరా” పాత్రలో కనిపించబోతున్నాడు అని ..సినిమాలో ఎన్టీఆర్ ది డ్యూయల్ క్యారెక్టర్ అని ఇక రచ్చ రంబోలా అని పొగిడేస్తున్నారు జనాలు..!!