అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చిన త్రిబుల్ ఆర్ నటుడు.. ఏమున్నాడ్రా బాబు..!

మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయి మంచి గుర్తింపు సంపాదించుకున్న సినిమాలలో రాజమౌళి సినిమాలు కూడా ఒకటి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి దగ్గరనుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ ని పొందింది.

త్రిబుల్ ఆర్ సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ మరియు చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన పలువురికి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే నటుడు అజయ్ దేవగన్ కి కూడా మంచి పాపులారిటీ ఏర్పడింది. ఇక తాజాగా అజయ్ తన లేటెస్ట్ పిక్స్ ని షేర్ చేశాడు.

తను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్స్ ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. షర్ట్ లేకుండా జిమ్ బాడీతో కనిపించాడు. ఇక ఈయ‌నని ఇలా చూసి పలువురు ఫ్యాన్స్ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఫొటోస్ చూసిన కొందరు.. నువ్వు సైడ్ క్యారెక్టర్ మెటీరియల్ కాదు బ్రో. హీరో మెటీరియల్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.