రజిని ” 171 ” మూవీపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్.. కామెంట్స్ వైరల్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇక ఇటీవలే లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన లోకేష్ కనకరాజ్‌ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రజిని 171 వ మూవీ లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ..” ఈ మూవీ స్క్రిప్ట్ పై ఇంకా వర్క్ చేయాల్సి ఉంది. అలానే నేను కొన్నాళ్లుగా రజిని సార్ తో టచ్ లో ఉన్నాను.

ఇక ఈ మూవీలో రజనీకాంత్ గ్రే షేడెడ్ రోల్లో కనిపించనున్నారు. అదేవిధంగా ఇది తన ఎల్ సి యు లో భాగం ఏమాత్రం కాదు ” అంటూ తెలియజేశాడు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈయన వ్యాఖ్యలు చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.