మద్యం మత్తులో మునిగి తేలిన అనుపమ.. వీడియో వైరల్..!

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుపమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించిన అనుపమ ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

ఇక అనుపమ నటిస్తున్న మరో మూవీ డీజే టిల్లు స్క్వేర్. ఈ సినిమాపై అనుపమ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో అనుపమ ఎంత బోల్ట్ క్యారెక్టర్ లో నటిస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటినుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మరియు టీజర్, పాటలు ఈ ముద్దుగుమ్మ బోల్డ్ నేస్ని చూపించాయి.

లిప్ కిస్ లతో పాటు అందాలను ఆరబోస్తూ దోస్ ని పెంచింది. ఇక తాజాగా అనుపమ ఓ వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో మరింత గ్లామర్ డోస్ పెంచింది. మద్యం మత్తులో మునిగి తేలుతూ సందడి చేసింది అనుపమ. ఇక ఈ వీడియోని చూసిన ప్రేక్షకులు టిల్లు గాడి మోజులో పడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.