సెలబ్రిటీస్ తినే ఈటింగ్ టైం ఇదే.. అందుకేనేమో అంత యంగ్ గా ఉన్నారు..!

సాధారణంగా మనం తినే తెల్ల అన్నం అరగడానికి 45 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. బ్రౌన్ రైస్ అరగడానికి మాత్రం గంటన్నర పైనే పడుతుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే చికెన్ అరగడానికి రెండు నుంచి మూడు గంటల సమయం వరకు పడుతుంది. అదేవిధంగా చాపలు మరియు రొయ్యలు వంటివి అరగడానికి నాలుగు గంటలు సమయం పడుతుంది.

నీటి శాతం ఎక్కువగా ఉండే టమాటో మరియు బీరకాయ కూరగాయలు అరగడానికి 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఇక పెరుగు పాలు వంటివి డైజెస్ట్ అవ్వడానికి గంటన్నర సమయం పడుతుంది. అందువల్ల మనం తినే ఆహారాన్ని టైం చూసుకుని తినాలి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఏడు గంటలకు తినాలి. ఇక మధ్యాహ్నం లంచ్ ని 11 గంటలకి తినాలి. ఇక రాత్రిపూట ఆహారాన్ని 7 గంటల లోపే తినేయాలి. అలా తినడం ద్వారా ఆహారాలు మన బాడీలో అరిగి వాటిలో ఉండే పోషకాలు మన బాడీకి అందుతాయి.

నిజానికి సినీ సెలబ్రిటీలు అంతా అందంగా ఉండడానికి అసలు సీక్రెట్ తినే టైమింగ్ నే. వారు తినే ఆహారాన్ని ఎప్పుడు ఒకే టైం కి తీసుకోవడం ద్వారా అనేక పోషకాలు అంది ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఎంతో గ్లామర్ గా ఉంటారు సినీ సెలబ్రిటీలు. అందువల్ల మీరు కూడా పైన చెప్పిన టైమింగ్స్ ని ఫాలో అయ్యే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అందమైన ముఖ సౌందర్యం మీ సొంతం.