కథల ఎంపిక విషయంలో వాళ్ళిద్దరే నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్.. మృణాల్ ఠాగూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

‘ సీతారామం ‘ మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌. మొద‌టి మూవీతోనే భారీ బ్లాక్ బ‌స్టర్ సొంతం చేసుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుసగా టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ క్రేజీ బ్యూటీగా దూసుకుపోతుంది. మొదట మృణాల్‌ మరాఠీ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు. అయితే తెలుగులో మాత్రం న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన మృణాల్‌కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ్ లోను వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతున్న ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది.

Sita Ramam Hindi Trailer: Dulquer Salmaan, Mrunal Thakur & Rashmika  Mandanna Starrer Love Saga Will Leave

మృణాల్‌ మాట్లాడుతూ తన మొదటి సినిమా సీతారామం తో ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలు ఉన్నాయంటూ వివరించింది. ఆమె తన కో యాక్ట్రెస్ అయినా దుల్కర్ సల్మాన్, రష్మిక మందన పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రష్మిక మందన ఎనర్జీ చూస్తే ఒక్కొక్కసారి షాక్ అవుతానని.. ఎన్ని గంటలు పనిచేసిన ఆమెలో అసలు కొద్దిగా కూడా అలసట కనిపించదు అంటూ వివరించింది. పాత్రల విషయంలో కూడా ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తుందంటూ చెప్పిన ఆమె.. సీతారామంలో అఫ్రీన్ లాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గ‌ట్స్‌ ఉండాలి.. ఆ సినిమాను ఆమె తప్ప మరెవ్వరు చేయలేరు అనిపించింది అంటూ రష్మికను పొగడ్తలతో ముంచేసింది.

దుల్కర్ సల్మాన్ గురించి వివరిస్తూ.. ఏ భాషలో మంచి పాత్ర దొరికిన వెంటనే యాక్సెప్ట్ చేసి.. ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోవడం ఆయనకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్‌కు నిదర్శనం అంటూ వివరించింది. ఏ జానర్‌లో సినిమా అయినా సరే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని వివరించిన ఆమె.. క‌త‌ల‌ పరంగా నేను వారిద్దరిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నా అంటూ వివరించింది. కాగా మృణాల్ ఠాగూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన.. ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.