నాకంటే చైతన్య తల్లి లక్ష్మీ మంచి మదర్.. అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఎస్ మీరు వింటున్నది నిజమే. ఈ కామెంట్స్‌ స్వయంగా అమల వివ‌రించింది. ఆమె మాట్లాడుతూ.. తన ఇద్దరు కొడుకులు అఖిల్ చాలా అల్లరి పిల్లాడని.. నాగచైతన్య చాలా పద్ధతిగా పెరిగాడు అంటూ వివరించింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారిద్దరి బాల్యం, గడిచిన తీరు, వాళ్ళు పెరిగిన విధానం ఆమె వివరించింది. ఇద్దరు పిల్లలు మాకు సమానమే అంటూ చెప్పుకొచ్చిన అమల.. అఖిల్ ఎక్కువ నాగచైతన్య తక్కువ అని ఎప్పుడూ నేను భావించలేదు.. అయితే నాగచైతన్య తల్లిదగ్గరే ఎక్కువగా చెన్నైలో పెరిగాడు. కాబట్టి కేవలం చైతు వేసవి సెలవులకు మాత్రమే హైదరాబాద్ కి వస్తూ ఉండేవాడట‌. చిన్నతనంలో ఎప్పుడైతే లక్ష్మీ మరియు నాగార్జున విడాకులు తీసుకున్నారో ఆమె వెంటనే చెన్నైకి వెళ్ళిపోయారని.. అక్కడే కొడుకును పెంచుతూ తను కూడా వృత్తిరీత్యా బిజీ అయిపోయిందంటూ తెలుస్తోంది.

నాగచైతన్య పెంపకం పూర్తి బాధ్యత లక్ష్మీ మాత్రమే తీసుకుందట. కాస్త పెద్ద అవుతున్న కొద్ది చైత‌న్య పై కూడా తండ్రికి హక్కు ఉంది కాబట్టి.. వేసవి సెలవల కోసం మాత్రమే లక్ష్మీ హైదరాబాద్‌కు చైతన్యన్ని పంపించేదట. వచ్చిన రెండు నెలలు కూడా తండ్రితో చాలా టైం గడిపేవాడట చైతు. అయితే అఖిల్ కూడా అన్న చైతు అంటే ఎంతో అభిమానం గా ఉండేవాడని.. ఎనిమిదేళ్లు తేడా ఉంది కాబట్టి నాగచైతన్య ఎక్కడ ఉంటే అఖిల్ అక్కడే ఉండేవాడని తెలుస్తుంది. అన్నా అన్నా అంటూ చైత‌న్య వెనకాల అఖిల్ తోకల తిరుగుతూ ఉండేవాడట. వీరిద్దరి సమ్మర్ హాలిడేస్ చాలా చక్కగా గడిచేవని చెన్నై నుంచి నాగచైతన్య ఎప్పుడు వస్తాడు అని అఖిల్ ఎదురు చూస్తూ ఉండేవాడ‌ట‌.

Trending now: Chaitu spotted with his Mom

చాలా సైలెంట్ గా ఉంటూ నాగచైతన్య అసలు అల్లరి చేసేవాడు కాదని వివరించింది అమల. లక్ష్మి.. నాగచైతన్యాన్ని చాలా చక్కగా పెంచిందని అఖిల్ కన్నా నాగచైతన్య పెంపకం అద్భుతంగా ఉందంటూ వివరించింది. దీంతో అమల మెచ్యూరిటీ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఏ తల్లి కూడా తన కుటుంబంలో ఇంకో వ్యక్తి వస్తాడు అంటే ఒప్పుకునే రోజులు కాదు. అలాంటిది లక్ష్మీ కొడుకు అయినప్పటికీ.. నాగార్జునకు కూడా కొడుకే కదా అని అమలా ఇద్దరు పిల్లలు విషయంలో సమానంగా బాధ్యత తీసుకుంది అంటూ తెలుస్తుంది. నిజంగా ఇది చాలా గ్రేట్ అంటూ అమలా ఫ్యాన్స్ ఆమెను ప్రశంసిస్తున్నారు.