వై ఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి మొదలుకానుంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే పెళ్లి పీటలేకనున్నాడు. ఈ మధ్యకాలంలో షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమలో పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన వైఎస్ షర్మిలా మాట్లాడుతూ.. ప్రేమించిన అమ్మాయి తోనే అతడి పెళ్లి చేసేందుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేసిన షర్మిల తన ఇంట్లో జరగబోతున్న ఈ శుభకార్యం గురించి ప్రజల అందరితో షేర్ చేసుకుంది.
ఇప్పటికే వైయస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయట. ఇక తన కొడుకుతో, అట్లూరి ప్రియ కి 2024 జనవరి 18న నిశ్చితార్థం జరిగనునట్లు వివరించారు. అలాగే 2024 ఫిబ్రవరి 17న వీరిద్దరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందట. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఎక్స్ వైదికపై షర్మిల పోస్ట్ చేసింది. జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వై యస్ ఆర్ ఘాట్‌ని సందర్శించబోతున్నట్లు.. మొదటి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద ఉంచి తండ్రి ఆశీస్సులను తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
ఇక షర్మిల కుమారుడు రాజారెడ్డి యూఎస్ లో ఉంటూ ప్రియా అట్లూరి అనే అమ్మాయిని ప్రేమించారు. గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతోపాటే వైయస్ విజయమ్మ ప్రియా అట్లూరికి చీర పెట్టిన ఫోటో ఒకటి బయటకు రావడంతో అప్పట్లోనే పెళ్లి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఇరుకుటుంబ సభ్యులు కూర్చుని ఎప్పుడు పెళ్లి చేయాలనే అంశంపై చర్చించుకున్నారని.. వారు స్పష్టత వచ్చిన తర్వాత నిశ్చితార్థంతో పాటు పెళ్లి తేదీలను కూడా ఒకేసారి పెళ్లి తేదిని కూడా ప్రకటించినట్లు షర్మిల వివరించింది.
మూడు ముళ్ళ బంధంతో ఫిబ్రవరి 15న రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్ లో వీరిద్దరి వివాహం జరగబోతుందట. జనవరి 18 హైదరాబాద్లో ఎంగేజ్‌మెంట్ ఉంటుందని తెలుస్తుంది. వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్లాన్ చేశారట. ఇప్పటికే బంధువులకు ఆత్మీయులకు స్నేహితులకు ఇన్విటేషన్ కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది.