ఏ న్యూ ఇయర్ కి చేయని పని.. ఈ 2024 లో చేసిన మహేశ్ బాబు.. మంచి మూడ్ లో ఉన్నాడే సారూ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . 2023కి ఎండ్ కార్డ్ పెడుతూ 2024 కి గ్రాండ్గా వెల్కమ్ చేసింది ప్రపంచం. చిన్న పెద్ద తేడా లేకుండా న్యూ ఇయర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్ సెలబ్రిటీస్ ముందుగానే విదేశాలకు వెళ్లి న్యూ ఇయర్ గ్రాండ్గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం దుబాయ్ కి ఫ్యామిలీతో వెళ్లిపోయారు.

అక్కడ న్యూ ఇయర్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . కాగా జనరల్ గా మహేష్ బాబు వేకేషన్స్ కి వెళ్ళిన పార్టీలన్న రిజర్వుడిగానే ఉంటారు . ఎప్పుడు కూడా తన లిమిట్స్ క్రాస్ చేయరు. కానీ ఫస్ట్ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మహేష్ బాబు చిన్నపిల్లాడిలా అరుస్తూ గంతులు వేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు .

దానికి కారణం కూడా ఉంది అంటున్నారు అభిమానులు . 2024 మహేష్ బాబుకి గుర్తుండిపోయే విధంగా ఉండబోతుంది అని .. జనవరి 12న “గుంటూరు కారం” సినిమా రిలీజ్ అవుతూ ఉండగా ఆ తర్వాత కెరియర్ లో ఫస్ట్ టైం రాజమౌళితో సినిమాకు కమిట్ అయ్యాడని. ఈ సినిమా కచ్చితంగా ఆయన కెరియర్లో ఓ బిగ్ మైల్ స్టోన్ క్రియేట్ చేయబోతుందని.. అందుకే మహేష్ బాబు ఇంత ఉత్సాహంగా ఉన్నారు అంటున్నారు జనాలు..!!