పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తే బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక కొత్త సంవత్సరం మొదలవడంతో ఎప్పుడు లాగానే ప్రభాస్ ఫ్యాన్స్ లో మరోసారి ప్రభాస్ పెళ్లి చర్చ మొదలయింది. ఈ ఏడాదైనా డార్లింగ్ పెళ్లి చేసుకుంటాడా, ఓ ఇంటివాడవుతాడా అంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అయితే ప్రభాస్ పెళ్లి విషయం నిన్న మొన్న మొదలైనది కాదు.
గత 4 -5 ఏళ్ళుగా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వచ్చేయడమైన ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ మరోసారి ప్రభాస్ పెళ్ళి చర్చ మొదలెట్టారు. వారికి అదో ఆనందం. న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి ప్రభాస్ పెళ్లి చర్చ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే 40 ఏళ్లు దాటిన ప్రభాస్‌ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనడం కూడా కరెక్ట్ కాదేమో.. అయినా ప్రభాస్ ఇప్పటికీ తన పెళ్లి విషయం అడిగితే ఏదో సాకుతో సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూనే ఉంటాడు.
ఇక ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ పాన్ ఇండియా హీరో ఇమేజ్ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ ఏడాది కచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక గతేడాది ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కచ్చితంగా వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి చేసేస్తాను అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ ఏడాది కచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ ఏడదైనా ప్రభాస్ పెళ్లి బాజాలు మోగుతాయో లేదో చూడాలి.