ఆ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో రామ్ చరణ్.. బన్నీ, విజయ్ కూడా తర్వాతే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ చిన్ని చిన్ని సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక‌ రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన మల్టీ స్టార‌ర్ ఆర్‌ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులర్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిటీ అవుతూ ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్నాడు. వరుస‌ సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న చెర్రీ ఇటీవల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్నాడు.

Who is better, Allu Arjun or Vijay Devarakonda? - Quora

ఇక సోషల్ మీడియాలో చెర్రీకి రోజురోజుకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇటీవల చరణ్ తన ఇన్‌స్టా ఖాతాలో 20 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించాడు. ఈ విషయంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ తర్వాత రామ్ చరణ్ ఉన్నాడు. అల్లు అర్జున్‌కి ఇన్‌స్టాగ్రామ్ లో 24.2 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, విజయ్ దేవరకొండకు 20.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వీరి తరువాత స్థానంలో రామ్ చరణ్ నిలిచాడు. 20 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న రామ్‌చరణ్.. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కంటే చాలా తక్కువ సమయంలోనే ఈ అధిక మొత్తంలో అభిమానులను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించాడు.

24.2 మిలియన్ సంపాదించుకోవడానికి అల్లు అర్జున్ ఏకంగా1925 రోజులు పట్టగా.. విజయ్ దేవరకొండకు 2050 రోజులు పట్టాయి. అయితే రామ్ చరణ్ మాత్రం కేవలం 1635 రోజుల్లోనే 20 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. అత్యంత తక్కువ సమయంలో అంతమంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరోగా రామ్ చరణ్ ముందు వరసలో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తాయా అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.