చిరంజీవి మూవీ లో దీపికా పదుకొనే.. ఏ క్యారెక్టర్ లో నటిస్తుందంటే.. ?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక విశిష్ట సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్క్రిప్ చాలా అద్భుతంగా ఉండడంతో.. దానిని చాలా జాగ్రత్తగా రూపొందించాలని.. మేకర్స్ భావిస్తున్నారట. ఇంతకుముందు తన బింబిసారా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వశిష్ట.. చిరంజీవితో మూవీ అవకాశం అందుకోవడంతో విశ్వంభరన్ని ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ హిట్ బాటలో నడిపించేందుకు కష్టపడుతున్నాడని సమాచారం.

ఈ సినిమాతో కూడా సక్సెస్ కొడితే తనకు స్టార్ హీరోల నుంచి మంచి అవకాశాలు రావడం కూడా కాయం. దీంతో చిరంజీవి సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని వ‌శిష్ఠ క‌సిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా డైరెక్షన్లో చిరంజీవి కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్లు సమాచారం. చిరంజీవి సినిమాల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అసలు ఒప్పుకోరు. అందుకే చిరు కూడా దగ్గరుండి ఈ సినిమాను ఎలా చేయాలో వశిష్టకు సజెషన్స్ ఇస్తున్నాడట. అయితే వశిష్ట కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా చిరంజీవి ఇచ్చే సలహాలను ఫాలో అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కూడా ఓ రోల్‌లో నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకి అదేంటో అనుకుంటున్నారా.. ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్.. కూడా ఈ సినిమాలో ఉండబోతుందని.. ఈ ఐటమ్ సాంగ్ లో దీపిక పదుకొనే నటిస్తోందని తెలుస్తుంది. నార్మల్ సినిమాల్లో ఉన్నట్లుగా కాకుండా ఈ సినిమాల్లో చాలా భిన్నంగా ఆ స్పెషల్ పాంగ్‌ ఉండబోతుందట. ఓ దేవకన్యతో స్పెషల్ సాంగ్ ఉండబోతుందని.. దేవకన్య పాత్రలో దీపిక పదుకొనే నటిస్తుందని తెలుస్తుంది.