నాగ్ ” నా సామి రంగ ” మూవీ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే..!

2024 సంక్రాంతి బరిలో ఆసక్తికర పోటీ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బరిలో అక్కినేని నాగార్జున హీరోగా ” నా సామి రంగ ” మూవీ కూడా ఉంది. ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో నాగార్జున సోగ్గాడే చిన్నినాయన మరియు బంగారు రాజు లాంటి సినిమాతో బాక్సాఫీస్ ని షేక్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది అని విషయాల్లోకి వెళితే నైజాం లో 5 కోట్ల రేంజ్ లో ధర పలికిన ఈ సినిమా సెడెడ్ 2.2 కోట్లు ఆంధ్రాలో మొత్తంగా కూడా ఎమ్మిగ కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా 15.30 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 19 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ని కోట్లు రాబడితేనే కానీ ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవలేదు. ఇక మరి నాగార్జున 19 కోట్ల కన్నా ఎక్కువ రాబట్టి అన్ని సినిమాలని పక్కకి నెట్టుతాడో లేదో చూడాలి మరి.